కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO..!

కోరిక తీర్చాలంటూ మహిళా VRO ఇంటికెళ్లిన MRO..

*ఏపీ లోని తిరుపతి జిల్లాలో కామాంధుడైన ఓ MRO కు బడితెపూజ…*

నాయుడు పేటలో నివాసం ఉండే మహిళా VROను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. ‘మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?’ అని మెసేజ్ లు పెట్టాడు. నిన్న బరితెగించి ఆమె ఇంటికి వెళ్లాడు. దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీంతో VRO తన తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వచ్చి అతడిని చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది.