ప్రజలకు మేరుగైన వైద్య సేవలు అందించాలి….
విద్యార్థులు ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి..
భూభారతి అర్జీలను త్వరగా పరిష్కరించాలి…..
ఎరువుల దుకాణదారులు తప్పనిసరిగా రిజిస్టర్లు నిర్వహించాలి…జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…
ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మేరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం తుంగతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ఓపి, ఐ పి రిజిస్ట్రేషన్ ఛాంబర్ పరిశీలించి ఈ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినవో అడిగి తెల్సుకొని స్కానింగ్, X-ray రూమ్, ను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు చేయు పరికరంను పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పేషంట్లను మంచిగా చూసుకోవాలని వారికి మంచి ఆహారం అందించాలని అన్నారు. సెల్యులైటిస్ తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బండ రామవరం గ్రామానికి చెందిన 35 సంవత్సరముల రమేష్, వెంపటి గ్రామానికి 36 సంవత్సరాల వెంకన్న ను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పి హెచ్ సి డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో
ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదని కలెక్టర్ కి చెప్పగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తదుపరి కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలి త్వరగా పూర్తి చేయాలని వాటర్ క్యూరింగ్ చేయాలని అన్నారు.తదుపరి కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలో మొక్కను నాటారు.
తదుపరి తుంగతుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసి వాటర్ ప్లాంట్, డైనింగ్ రూమ్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ పరిశీలించి, ఖాన్ అకాడమీ ద్వారా బయో సైన్స్ పై ఆన్లైన్ పాఠాలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులను హిందీ, తెలుగు చదివించారు. విద్యార్థినులను మీరు పెద్దయిన తర్వాత ఏ రంగంలో స్థిరపడతారని అడిగి తెలుసుకున్నారు. చాలామందిని మేము డాక్టర్లు అవుతామని, కొంతమంది సాఫ్ట్ వేర్
ల మవుతానని, జర్నలిస్టుల మవుతామని కలెక్టర్ కి చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్న ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పునాది, నైపుణ్యము, వ్యక్తిత్వం ఈ మూడు లక్ష్యాలతో ముందు వెళ్లాలని అప్పుడే మనం అనుకున్నది సాధించగలమని అందుకుగాను ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. పదవ తరగతి బాలికలు, టీచర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
*ఆడపిల్లలని ఆదుకున్న కలెక్టర్*
*ఉన్నత చదువులకి సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు*
తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్ సి కాలనీ కి చెందిన తడకమల్ల రాములమ్మ మూడు సంవత్సరాల క్రితం మరణించగా తండ్రి వెంకన్న ఇటీవల మరణించటంతో ఇద్దరు ఆడపిల్లలు ఆనాధలు గా మారినారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పెద్ద కూతురు ఉమాకి ఇష్టమైన బి ఎస్ సి నర్సింగ్ కోర్స్ చేపిస్తానని, చిన్న కూతురు శ్రీజని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో 8 వ తరగతి లో చేర్పిస్తున్నట్టు అలాగే వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకి ప్రతిపాదనలు పంపాలని ఎంపిడిఓ కి కలెక్టర్ ఆదేశించారు.
*జిల్లాలో యూరియా, డి ఎ పి సరిపోను నిల్వలు*
ఎరువుల దుకాణాలలో సరిపోను యూరియా, డి ఎ పి సరిపోను నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ప్రతి దుకాణంలో రిజిస్టర్లు తప్పకుండా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానంద్, ఎంపీడీవో శేష్ కుమార్, డిటిహెచ్ఎస్ డా,, వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఉపేందర్, దీప్తి, గౌతమ్, సూపర్డెంట్ నిర్మల కుమారి, ఫార్మసిస్ట్ నాగమణి, హెడ్మాస్టర్ కల్పన, ఉపాధ్యాయులు రమాదేవి, సల్మా, శోభ, సమత తదితరులు పాల్గొన్నారు.