నార్కట్ పల్లి – అద్దంకి హైవేలో రాత్రి డీజిల్ దొంగల హల్చల్..

నల్లగొండ జిల్లా.

నార్కట్ పల్లి – అద్దంకి హైవేలో రాత్రి డీజిల్ దొంగల హల్చల్..

నార్కట్ పల్లి శివారులో ఓ లారీ నుంచి డీజిల్ దొంగిలిస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.

పోలీసులను చూసి వెహికిల్ వదిలి పారిపోయిన దొంగలు.

_• ఇన్నోవా కార్, సుమారు 1000లిటర్స్ డీజిల్, ఒక సెల్ ఫోన్ లభ్యం._

దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. కేసు నమోదు..

రాత్రి సమయంలో ఆగివున్న లారిలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు..

హైవేపై రాత్రిళ్లు లారీ ఆపితే నిద్రలేచేసరికి ట్యాంకులు ఖాళీ అవుతున్నాయట. ఎవరీ దొంగలు? ఎందుకీ దారుణాలు? అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై డీజిల్ దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. .హైవేలో రాత్రి వేళల్లో రోడ్ల పక్కన ఆపేసిన లారీలు, బస్సులు, టిప్పర్లు, భారీ ట్రక్కులు, పొక్లెయిన్‌లలో డీజిల్ మాయం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వారిని బెదిరిస్తున్నారు.. అంతేకాదు దాడులు చేస్తున్నారు.. అందుకే ఆ హైవేలో వెళ్లాలంటే ఆలోచిస్తున్నారట. ఒంగోలు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే.. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేలో ఇలా తరచూ డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయంటు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..