సుప్రీంకోర్టు సంచలన తీర్పు…ఆ ఇద్దరి ఎమ్మెల్సీల నియమకం రద్దు ….!

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల నియామకాన్ని రద్దు చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం, వేరే వాళ్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది..జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలలో తదుపరి నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేసింది సుప్రీంకోర్టు. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకం అయిన సంగతి తెలిసిందే…గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది కచ్చితంగా సంచలనం అంశంగా చూడాలి. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్, గతంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా ఉన్న కోదండరామ్ మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఆయన నియామకాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడం అనేది ఆసక్తికర అంశం.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపింది. వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ వెంటనే దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి ప్రమాణస్వీకారానికి కోర్టు లైన్ క్లియర్ చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాది కాలంగా పోరాటం చేస్తూ వచ్చారు. తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది..