రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిర్యాలగూడలో 63.2 మిల్లీమీటర్లు, దామరచర్లలో 77.2, వేములపల్లి లో 56.5, అడవిదేవులపల్లి లో 43.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది…
నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. వర్షాల దృష్ట్యా హైదరాబాద్లో హెడ్రా, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు..
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్, హనుమకొండ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.
మిర్యాలగూడ పట్టణంలోని రంగన్న కాలనీ, విద్యానగర్ కాలనీలలోని రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండడంతో మిర్యాలగూడ, సూర్యాపేట వయా భీమవరం రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఇరువైపులా కంచ వేసి రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా శెట్టిపాలెం వద్ద చిత్రపరకవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నడంతో పరిసర ప్రాంతాలలోని పొలాలు కొంతమేర నీటమునిగాయి. తుంగపాడు, అడవిదేవులపల్లి మార్గంలో రామన్నపేట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వరద నీరు రోడ్డు పైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు ఉధృతి తగ్గిన తర్వాత గ్రామస్థులు రాకపోకలు కొనసాగిస్తున్నారు…