తనను కలవాటానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలను తీసుకొని రావద్దు… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా…హుజూర్నగర్ మండలం మగ్ధుం నగర్ వద్ద 1041 ప్రభుత్వ భూముల పరిశీలన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
అనంతరం ఆయన మాట్లాడుతూ.
ఇక పై తనను కలవాటానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలను తీసుకొని రాకుండా ఆడబ్బులను జిల్లా గ్రంధాలయానికి ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మంత్రి ప్రకటించిన
మొదటి రోజే మంత్రి పిలుపుమేరకు చలసాని రాజీవ్ గ్రంధాలయ సంస్థకు 10,000 రూపాయల చెక్కుని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు.
తనను కలిసేందుకు పూల బొకేలు, శాలువాలు తీసుకొని రాకుండా ఆ డబ్బులను జిల్లా గ్రంధాలయానికి ఇవ్వాలని ప్రకటించిన మొదటి రోజే గ్రంధాలయంకి సహాయం చేయటం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.గ్రంధాలయంలో పేద విద్యార్థులకి ఆహ్లాదకర వాతావరణం కల్పించి బాగా చదువుకొని జీవితంలో స్థిర పడేందుకు ఈ డబ్బును గ్రంధాలయంలో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు…అనంతరం మంత్రి హుజూర్ నగర్ లో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకి హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ముగ్దం నగర్ వద్ద సర్వే నంబర్ 1041 ప్రభుత్వ భూములు,
మేళ్లచెర్వు పరిధిలోని పాల గట్టు వద్ద ప్రభుత్వ భూములను, పాలకీడు మండలం గుండ్లపాడు రెవిన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఉగాది పర్వదినాన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తునట్లు హామీ ఇచ్చారని, దానిలో భాగంగా నే వ్యవసాయ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేయటం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మూడు స్థలాలపై అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు పరిశీలించటం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్డీఓ శ్రీనివాసులు, తహసిల్దార్లు నాగార్జున రెడ్డి,కమలాకర్,ప్రజా ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది తదితరులు మంత్రి వెంట ఉన్నారు..