దర్గా పైకప్పు కూలిన ప్రమాదంలో ఏడుగురు మృతి..!

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. నిజాముద్దీన్‌లోని హుమాయూన్ సమాధి సమీపంలోని ఓ దర్గాలో విషాదం జరిగింది. ఓ దర్గా పైకప్పు కూలిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని సమాచారం…
Nizamuddin Dargah Roof Collapse.
ఓ దర్గా పైకప్పు కూలిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని సమాచారం. కూలిన శిథిలాల కింద మరో 5 మంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరిన సహాయబృందాలు వేగంగా చర్యలు చేపడుతున్నారు. .ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌టీమ్‌లు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఇన్వెస్టిగేటర్లు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు వీలుగా దర్గా చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సమాధి గోపురం కూలిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు…