బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశం ప్రారంభం భేటీలో పాల్గొన్న మోదీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్..

బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశం ప్రారంభం
భేటీలో పాల్గొన్న మోదీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ..

BJP పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పాల్గొననున్నారు. ఆగస్టు 6న జరిగిన NDA సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నారు. .ఎన్డీయే కానీ.. ఇండి కూటమి కానీ ఇంకా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. ఈ నెల 21 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు కాబోయే ఉప రాష్ట్రపతి ఎవరనేది తేలిపోనుంది. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేస్తారా.. ? దక్షిణాది నుంచి అభ్యర్ధిని నిలబెబడతా.. ? లేకుంటే అనూహ్యంగా మధ్య మార్గంగా ఎవరు ఊహించని వ్యక్తిని ఎంపిక చేసినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.

భారత ఉప రాష్ట్రపతి ని పార్లమెంట్ రెండు సభల సభ్యులు ఎన్నుకుంటారు. ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ ఎన్నికలో లోక్ సభతో పాటు రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉండనుంది. ప్రస్తుతం లోక్ సభలో 543 సభ్యులకు గాను 542 సభ్యులున్నారు. పశ్చిమ బంగల్ లోని బసీర్ హాట్ సీటు కు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

రాజ్యసభలో 245 మందికి గాను 240 మంది మెంబర్స్ ఉన్నారు. 5 ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి 786 మంది మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఉప రాష్ట్రపతి ఎలక్షన్స్ కు 394 మంది మెజారిటీ అవసరం. దిగువ సభలో ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎన్డీయే కు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్టీయేకు అండగా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వారు. మిగిలిన కాలానికి కాకుండా.. మొత్తంగా 5 యేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు.