గో బ్యాక్ మార్వాడీ’.. నేడు తెలంగాణ బంద్..!

స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపు

మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్‌కు
సహకరించాలని కోరిన OU JAC

ఈ బంద్‌కు పలు
జిల్లాల్లోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతు

నల్గొండ, వరంగల్, జనగామ, మక్తల్, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన..తెలంగాణ బంద్‌కు ప్రధాన కారణం మోండా మార్కెట్‌ ఘటనే. తాజాగా మోండా మార్కెట్‌లో మార్వాడీ వ్యాపారులు ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు స్థానిక ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా.. స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్‌ ఘటనను ఖండిస్తూ.. ఓయూ జేఏసీ నేడు బందుకు పిలుపునిచ్చింది. ప్రజలందరూ దీనికి మద్దతిచ్చి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు…మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ.. కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో స్థానిక వ్యాపారాలకు మాత్రమే కాకూండా.. ఉపాధికి కూడా మార్వాడీల నుంచి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం రాజకీయంగా కూడా ఉద్రిక్తంగా మారింది. కొందరు ఈ ఉద్యమంకు మద్దతిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మద్దతిస్తున్నారు.