ఎంట్రీ ఇది….. ఆ గెటప్‌లో వినాయకుడి విగ్రహం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం..!!..

*హైదరాబాద్ – గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిన ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్..

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలినట్లుగా ఈ గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సీఎం తరహాలో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో తన అర్ధాంగి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు..

కొంత మంది చిత్రమైన కామెంట్స్...

కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు, విగ్రహంపై నెగటివ్ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు…. సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో ఉన్న వినాయకుని తయారు చేశారు ఓకే మరి నిమజ్జనం ఎప్పుడు అంటూ నెగటివ్ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.. మరికొందరు అరే ఏంట్రా ఇది అంటూ సెటైర్లు వేస్తున్నారు..