భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి.. ఆర్డీవో కు బీజేపీ నాయకుల వినతి పత్రం..

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు చర్యల గురించి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డిఓ) కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది..

ఈ సందర్భంగా హుజూర్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, కుంటలు, చెరువులు పెద్ద ఎత్తున పొంగి రహదారులు కొట్టుకుపోవడం అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు అన్ని మునిగిపోయి ప్రజలు విపరీత పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది…. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో కూడా ‘క్లౌడ్ బరస్ట్’ ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వారు హెచ్చరించిన సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దానిలో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించి వారికి సరైనటువంటి మౌలిక వసతులు, ఆహార ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అధికారులందరిని అప్రమత్తం చేయడంతో పాటు హెల్ప్ లైన్ కొరకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అంటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల అధ్యక్షులు వెంకట శివ, గరిడేపల్లి మండల అధ్యక్షులు కుక్కడపు వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు జనిగల శ్రీనివాస్, నర్సింగ్ నాగ సైదులు, మేకపోతుల వీర ప్రసాద్, బల్వంత్ సింగ్, జాల వెంకన్న మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959