దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ…

మా తెలంగాణ విద్యార్థులకు స్కిల్స్ తక్కువ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!?

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారు.

అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున వారు గొంతుకగా నిలుస్తున్నారు.

కేసీ వేణుగోపాల్ తన నియోజకవర్గంతోపాటు కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారు.

వేణుగోపాల్ 2006లో ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉంది.

10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయి.

ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500లకు పైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు.

దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది.

దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ.

ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

కేరళ రాష్ట్రంలో విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.

10, 12వ తరగతుల తర్వాత… సున్నా శాతం డ్రాపౌవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదు.

విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు..

అందరూ పాస్ అయ్యి సర్టిఫికెట్లు పొందుతున్నారు.. కానీ స్కిల్స్ లేవు. అందుకే నేను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించాను. కేరళ పొంతువాల్ ఎంపీ మెరిట్ అవార్డ్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు..
https://x.com/Gowtham_Goud6/status/1962113678456873388

విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తా.

అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ రాష్ట్రం.

తెలంగాణలో విద్యాభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేస్తున్నాం.

విద్యకు ఉన్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నా.

ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది.

వచ్చే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

2047 నాటికి తెలంగాణను మూడో ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నాం.

తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం.

కేవలం 55 రోజుల్లో తెలంగాణలో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం.

వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాం.

ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నాం.

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం.

యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.

ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించాం.

ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం.

ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంటున్నాం.

విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన కేసీ వేణుగోపాల్‌కు అభినందనలు…