వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్‌వో తొలగింపు..!

వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్‌వో తొలగింపు :

బీఆర్​ఎస్​ అధికారిక వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి కవిత పీఆర్‌వోను ఆ పార్టీ తొలగించింది. కవిత ప్రెస్‌నోట్‌, వీడియో క్లిప్పులను సైతం వాట్సప్‌ గ్రూప్‌ల నుంచి తొలగించింది. అంతేకాకుండా హరీశ్‌రావు, సంతోష్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల సారాంశాన్ని కూడా బీఆర్​ఎస్ డిలీట్ చేసింది.

ఆధారాలతో సహా తిప్పికొట్టారు : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై నిన్న మాట్లాడిన హరీశ్‌రావుకు మద్దతుగా బీఆర్​ఎస్​ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ హరీశ్‌రావును ఉద్దేశించి పోస్టు చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని తెలిపింది.