కోదాడ ,హుజూర్నగర్ నియోజకవర్గాలలో 250 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, నిర్మాణం.. మంత్రి ఉత్తమ్..

MINISTER UTTAM
సూర్యాపేట జిల్లా..చింతలపాలెం లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం హుజూర్ నగర్ మండలం, వేపలసింగారంలో రూ 2.31 కోట్లతో వేపలసింగారం నుండి కందిబండ వరకు BT రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.
.పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేందుకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. చింత్రియాల మెయిన్ రోడ్డు నుండి కేజీబీవీ పాఠశాల వరకు సిసి రోడ్డు నిర్మించాలని ,అదేవిధంగా పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ తో మంత్రి ఫోన్లో మాట్లాడి మంజూరు చేయించారు.. కోదాడ ,హుజూర్నగర్ నియోజకవర్గాలలో 250 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆరు కోట్ల రూపాయలతో ఐటిఐ కళాశాల, హుజూర్ నగర్ 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, హుజూర్నగర్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ కళాశాల నిర్మాణానికి స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని, 7:50 కోట్లతో జూనియర్ కాలేజ్,4:50 కోట్లతో డిగ్రీ కాలేజ్ నూతన భవనాలు నిర్మించడం జరుగుతున్నదని, కోదాడలో 50 కోట్ల రూపాయలతో జవహర్ నవోదయ పాఠశాల ను మంజూరు చేశామని మంత్రి తెలిపారు.
.గతంలో తాను ఎం ఎల్ ఏ గా ఉన్న సమయంలో చింతలపాలెం మండలానికి రావడానికి సరైన రోడ్డు వసతి ఉండేది కాదని, అలాంటిది ఈ 30 సంవత్సరాల లో చింతలపాలెం మండలం సర్వతాముఖభివృద్ధితో ముందుకెళుతున్నదని మంత్రి అన్నారు.
.చింతలపాలెం మండలంలో నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, ముత్యాల బ్రాంచ్ లిఫ్ట్ ఇరిగేషన్, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి తద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు…

జాతీయస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలను కూడా నియోజకవర్గంలోకి తేవడం జరుగుతుంది..

కోదాడ,, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధితోపాటు ప్రతి ఒక్కరు కూడా విద్య అందుబాటులో ఉండేలా ఐటిఐ కాలేజీలను కూడా తెప్పించడం జరుగుతుంది..

చింతలపాలెం మండలం ప్రజలకి,, నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది.

గతంలో తాను పోటీ చేసినప్పుడు కనీసం చింతలపాలెం మండలంలో రోడ్లు కూడా లేవని.. తాను పోటీ చేసి గెలిచిన తర్వాత చింతలపాలెం మేళ్లచెరువు మండలాలకి అద్భుతమైన రోడ్లను వేసి డెవలప్ చేశానని అన్నారు…

హుజూర్నగర్ లో ఇంటర్ కాలేజీకి డిగ్రీ కాలేజీ రెండు కలిపి సుమారు 11 కోట్ల పైన నిధులు కేటాయించి డెవలప్ చేస్తున్నామని అన్నారు..

విద్య విషయంలో ఎవరూ కూడా ఇబ్బంది పడవద్దు అనేది తన ఉద్దేశం గా పేర్కొన్నారు…

గతంలో ఐటిఐ కాలేజీ అంటే ఎక్కడో ఉండేది అనే అనుకునేవారు కానీ ఇప్పుడు ఐటిఐ కాలేజీలు కూడా ఐఐటీ కాలేజీలు కూడా మన దగ్గర పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,కోఆర్డినేటర్ పూలమ్మ, ప్రత్యేక అధికారి ప్రసన్న కుమారి, టీజీ డబ్ల్యూ ఐ డి సి డి ఈ రమేష్, తాసిల్దార్ సురేందర్ రెడ్డి,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.