గ్రూప్-1 మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాకింగ్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాము విధించిన నిబంధనల మేరకు మళ్లీ మూల్యంకనం చేయాలని ఆదేశించింది. పునః మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 8 నెలల్లోగా మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునః మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మోడరేషన్ విధానంలో పునః మూల్యాంకనం చేయాలని గౌరవ కోర్టు నిర్దేశించింది. ఈ సందర్బంగా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసు తీర్పును జడ్జి ప్రస్తావించారు.
ఎనిమిది నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు సూచించింది. గ్రూప్-1 మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా, తాజాగా గ్రూప్-1 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నిర్ణయం వెలువరించారు. టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లు హైకోర్టు సూచించింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునః మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. పునః మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఎనిమిది నెలల్లో మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.