సూర్యాపేట జిల్లా…
*హుజూర్ నగర్ లో brs పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ MLA తెలగం వెంకట్రావ్ ,, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బాబురావు …
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా… నేడు హుజూర్ నగర్ లంబాడి జేఏసీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమావేశం…
*హుజూర్ నగర్ లో….. సెప్టెంబర్ 17న జరగనున్న లంబాడీ ఆత్మగౌరవ మహా ర్యాలీ,,, పార్టీలకతీతంగా తరలివచ్చి విజయం వంతం చేయాలని పిలుపునిచ్చారు*..
*ఈ సందర్భంగా పలువురు లంబాడి జేఏసీ నాయకులు మాట్లాడుతూ..*
కాంగ్రెస్ ప్రభుత్వం తలా తోకాలేని పనులు చేస్తూ , కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు.. 1970 నుండే ఓ ఆర్టికల్ తయారుచేసి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని, ఇప్పుడు తెలివి లేని తెలగం వెంకట్రావు,, సోయలేని సోయం బాబురావు ఇద్దరూ కలిసి ఎస్టీలపై కక్షగట్టి.. గిరిజనులపై దొంగ ప్రేమ కారుస్తూ లంబాడీలని ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు…దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు,, ఒకే కుటుంబములా కలిసిన తమ మధ్య వివాదాలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమైందని అన్నారు…ఇలాంటి పనికిమాలిన చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పవని హెచ్చరించారు…ఈనెల 17వ తారీకున జరగనున్న లంబాడ ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి, జగన్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ నాయక్.. రాథోడ్ నాయక్,, నగేష్, శ్రీను, కృష్ణ, చంద్రమౌళి.. తదితరులు పాల్గొన్నారు.