తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ఇదే.

హైదారాబాద్:

తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ఇదే..

తీన్మార్ మల్లన్న బంజారాహిల్స్లోని తాజ్ క్రిష్ణా హోటల్లో ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు…

ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు…

ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి…*

జెండాపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అని రాసి ఉంది…

బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు.

పార్టీ జెండా.. అజెండా..

పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు. జెండా మధ్యలో పడికిలి బిగించిన చేయితో పాటు.. కార్మిక చక్రం, వరి కంకులతో జెండా రూపొందించారు. జెండా పై భాగంలో ఆత్మ గౌరవం, అధికారం, వాటా నినాదాలను పేర్కొన్నారు. అదే విధంగా పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేర్కొన్నారు. బీసీ మేధావి నారా గోని చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆకుపచ్చ రంగు అంటే రైతులు.. ఎర్ర రంగు అంటే పోరాటం అని ఈ సందర్భంగా ప్రకటించారు మల్లన్న. డిజైనర్ రాజేశం పార్టీ జెండాను రూపొందించినట్లు తెలిపారు.

తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన పార్టీ ఆవిష్కార సభకు బీసీలు, వివిధ కుల సంఘాల నేతలు తరలి వచ్చారు. బీసీల రాజ్యాధికారం కోసం కలిసి రావాలని ఈ సందర్భంగా తీన్మా్ర్ మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణలో 90 శాతం ఉన్న బీసీల రాజ్యాధికారం కోసం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ మల్లన్న…