రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు .. సునామీ హెచ్చరిక జారీ.

రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూకంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భూకంపం 10 కి.మీ లోతులో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. రెండోసారి 5.8 తీవ్రతతో నమోదైనట్లు పేర్కొంది. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికను జారీ చేసింది.