పాక్ ఎయిర్ స్ట్రైక్.. 30 మంది దుర్మరణం!.

ఉగ్రవాదుల టార్గెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో రాత్రి 2 గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) JF-17 ఫైటర్ జెట్‌లతో 8 LS-6 బాంబులు ఉద్గారించింది..ఇది పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై లక్ష్యంగా చేసిన దాడిగా తెలుస్తోంది.

ఉగ్రవాదుల టార్గెట్‌ పాక్‌ ఆర్మీ చేసి ఈ దాడుల్లో సుమారు 20-30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దాడులతో ఘటనా స్థలంలో ఐదు నుంచి 10 ఇళ్ల వరకు ధ్వంసం అయ్యాయని, 20 మందికిపైగా గాయపడ్డట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..
https://x.com/geofrontlinetv/status/1970029705995948273?t=REE0bY1JVUuwlp_GflxEBA&s=19
మాత్రే దారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. తెహ్రికీ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ముష్కరులే లక్ష్యంగా పాక్‌ సైన్యం ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమయ్యాయి. పాక్ సైన్యం JF 14 థండర్‌ జెట్లను ప్రయోగించాయి. జనావాసాలు ఉన్న ప్రాంతాల్లోనే ఎనిమిది బాంబు దాడులు జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది..

https://x.com/geofrontlinetv/status/1970029705995948273?t=nJljlfu2f9fz2ztEOe2iAw&s=19.

స్థానికులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ వైమానిక దాడులు పాక్ సైన్యమే చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన పాక్ ఆర్మీ మాత్రం ఈ దాడులకు తమ బాధ్యత లేదని కొట్టిపారేసింది. మెత్రా దారా గ్రామంలోని ఓ ఇంట్లో ఖవార్జీ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను నిల్వచేశాయని.. వాటివల్లే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పాక్‌ మిలటరీ ప్రతినిధి తెలిపారు.

https://x.com/mayankcdp/status/1970009712122048649?t=2XzzVNn8EL9S0EWoigx2tw&s=19