బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది…
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది..
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేల, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసేఅవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు ఉరుములు, మెరుపు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది..