స్థానిక సంస్థల ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డికి అందజేసిన SEC రాణికుముదిని..!!;

స్థానిక సంస్థల ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డికి అందజేసిన SEC రాణికుముదిని

రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొన్న SEC.

రేవంత్ రెడ్డి సూచనల మేరకు మార్పులు చేసి, సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే అవకాశం._..

ప్రభుత్వ ఉత్తర్వులలోని కీలక అంశాలు

రాష్ట్రంలో బీసీల జనాభా 56.33%గా ఉందని, అయితే స్థానిక సంస్థలలో వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని శ్రీ బూసాని వెంకటేశ్వర రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. క్షేత్రస్థాయి ఆధారాలు, సామాజిక, రాజకీయ సూచికలను పరిశీలించిన కమిషన్, బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులను, బీసీ జనాభా రాజకీయ ప్రాతినిధ్య అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, “తెలంగాణ వెనుకబడిన తరగతుల (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు) బిల్లు, 2025″ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించాయి.