మూసీ ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ బస్టాండ్..!

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసారాంబాగ్‌ బ్రిడ్జ్ పరిస్థితి గందరగోళంగా మారింది. మూసీ నది ఉగ్రరూపంలో ప్రవహిస్తూ, బ్రిడ్జీపై సుమారు 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జీ, దోబీ ఘాట్, జలమయమైన పెట్రోల్ బంక్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ భారీ వరద ఉధృతిని చూసి స్థానికులు భయపడుతున్నారు..

అంబర్‌పేట్, మూసారంబాగ్ వద్ద కుంగిన నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి.

మూసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని రెండేళ్లుగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి..

పైనుంచి వస్తున్న వరద తాకిడికి కుప్పకూలిన సపోర్టింగ్ సెంట్రింగ్ ఐరన్ రాడ్స్.

https://x.com/TeluguScribe/status/1971619228139901054

https://x.com/Oxxy_7/status/1971634933316919347

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మూసీ వ‌ర‌ద ముంచెత్తింది. మూసీ న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఎంజీబీఎస్ వ‌ద్ద మూసీ ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఎంజీబీఎస్ వ‌ద్ద ఉన్న రెండు బ్రిడ్జిల పైనుంచి మూసీ ఉర‌క‌లేస్తోంది. దీంతో ఎంజీబీఎస్‌ను వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. ఎంజీబీఎస్‌లోకి వ‌ర‌ద నీరు రావ‌డంతో.. తాత్కాలికంగా మూసివేశారు. ఎంజీబీఎస్ లోప‌లికి ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌యాణికులు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది..శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి ఎంజీబీఎస్‌లోకి వ‌ర‌ద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు. వ‌ర‌ద ప్ర‌వాహం దృష్ట్యా బ‌స్సుల‌ను ఎంజీబీఎస్ లోప‌లికి అనుమ‌తించ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను తాత్కాలికంగా మ‌ళ్లించామ‌ని తెలిపారు. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ నుంచి వ‌చ్చే బ‌స్సులు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌ర‌కు, క‌ర్నూల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను ఆరాంఘ‌ర్ వ‌ద్ద మ‌ళ్లిస్తున్నారు. వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ నుంచి వ‌చ్చే బ‌స్సులు ఉప్ప‌ల్ వ‌ర‌కే అనుమ‌తిస్తున్నారు. ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను జేబీఎస్ వ‌ర‌కు అనుమ‌తిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ చేసుకున్న ప్ర‌యాణికుల పికప్ పాయింట్ల‌ను మార్చామ‌ని సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు. రేపు మ‌రో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అద‌నంగా విధుల్లో ఉంటార‌ని చెప్పారు..

కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డుమీదికొచ్చారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌ సమీపంలోని వినాయకవీధి, రసూల్‌పురా ప్రాంతాల్లోంచి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో చాదర్‌ఘాట్‌ శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో ఉన్న 55 మందిని గోడే కీ ఖబర్‌ ప్రాంతంలోని కమ్యూనిటీ కేంద్రానికి తరలించారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వేపై నుంచి నీరు వెళుతుండటంతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కాజ్‌వేను ఏ క్షణమైనా మూసివేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మూసారంబాగ్‌ వంతెనపై నుంచి నాలుగు అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. గోల్నాక మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. హుస్సేనీఆలంలోని శివాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపేటపై పొద్దుటూరు, చినమంగళవారం వంతెనలు మూసివేశారు. సుల్తాన్‌పూర్‌-ఆమడపూర్‌ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద.. గండిపేట కల్వర్టు వద్ద, మంచిరేవుల కల్వర్టు వద్ద, రాయల్‌ ఫంక్షన్‌హాల్‌ మిలటరీ ఏరియా వద్ద రాకపోకలు నిలిపివేశారు. బాపూఘాట్‌ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు ఎగువ నుంచి 8వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తోంది. హిమాయత్‌సాగర్‌ ఆరు గేట్లను ఎత్తి 14,446 క్యూసెక్కులను దిగువకు వదిలారు…

పురానాపూల్ వ‌ద్ద మూసీ న‌ది మ‌ధ్య‌లో ఉన్న శివాల‌యంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. వ‌ర‌ద భారీగా పెర‌గ‌డంతో.. పూజారి కుటుంబం ఆల‌యంపైకి ఎక్కి నిల్చున్నారు. పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తం న‌లుగురు వ్య‌క్తులు వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు…

చాద‌ర్‌ఘాట్ చిన్న వంతెన‌పై 6 అడుగుల మేర వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. మూసారంబాగ్ వంతెన‌పై 10 అడుగుల మేర న‌ది ఉప్పొంగి ఉర‌క‌లేస్తుంది. ఇక అంబ‌ర్‌పేట్ – మూసారంబాగ్ మ‌ధ్య నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిని తాకుతూ వ‌ర‌ద కొన‌సాగుతోంది. ఈ వ‌ర‌ద నీటిలో నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది. మూసారంబాగ్ వైపు ఉన్న పెట్రోల్ పంపు కూడా నీట మునిగింది..

వ‌ర‌ద ప్ర‌వాహం దృష్ట్యా బ‌స్సుల‌ను ఎంజీబీఎస్ లోప‌లికి అనుమ‌తించ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను తాత్కాలికంగా మ‌ళ్లించామ‌ని తెలిపారు. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ నుంచి వ‌చ్చే బ‌స్సులు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌ర‌కు, క‌ర్నూల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను ఆరాంఘ‌ర్ వ‌ద్ద మ‌ళ్లిస్తున్నారు. వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ నుంచి వ‌చ్చే బ‌స్సులు ఉప్ప‌ల్ వ‌ర‌కే అనుమ‌తిస్తున్నారు. ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను జేబీఎస్ వ‌ర‌కు అనుమ‌తిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ చేసుకున్న ప్ర‌యాణికుల పికప్ పాయింట్ల‌ను మార్చామ‌ని సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు. రేపు మ‌రో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అద‌నంగా విధుల్లో ఉంటార‌ని చెప్పారు..

అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..