స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం…..

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం…

Local body elections
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్కికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని తెలిపారు. 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు…తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్కికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.-మొత్తం గ్రామ పంచాయితీలు 12,733లకు గానూ 1,12, 288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, మూఢు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని తెలిపారు…

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు…

ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు…

రెండు విడతల్లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు..

మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..

అక్టోబర్ 9 నుండి నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం..

రెండో విడత నామినేషన్లు అక్టోబర్ 13 నుండి ప్రారంభం..

అక్టోబర్ 23 న మొదటి విడత ఎన్నికలు…

రెండో విడత ఎన్నికలు అక్టోబర్ 27 న..

నవంబర్ 11 న కౌంటింగ్..

సర్పంచ్ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరుగనున్నాయి..

మొదటి విడత ఎన్నికలు 31 అక్టోబర్
రెండో విడత ఎన్నికలు…నవంబర్ 4
మూడో విడత ఎన్నికలు నవంబర్ 8