విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ జంట ఎపుడు పార్టీలకు వెళ్లినా.. కలిసి దర్శనమిచ్చేవారు. అంతేకాదు వీళ్లిద్దరు వెకేషన్ కోసం జంటగా వెళ్లిన సందర్భాలున్నాయి. అపుడుపుడు ఎయిర్ పోర్ట్ లో వీళ్లిద్దరు కలిసి కనిపించి వాటికి బలం చూకూర్చేవారు. తాజాగా వీళ్లిద్దరు నిశ్చితార్దం చేసుకొని ఆ రూమర్స్ కు పులిస్టాప్ పెట్టారు.. వీళ్లిద్దరి పెళ్లి వచ్చే ఫిబ్రవరి 12న జరగనున్నట్టు సమాచారం. అది కూడా రష్మిక సొంతూరు మంగళూరులో ఓ ప్యాలెస్ లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకకు తెలుగు, హిందీ సహ వివిధ సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు బడా హీరోలు, సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు సమాచారం…