జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌…!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. కాంగ్రెస్‌ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్‌ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్‌ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్‌లో చేరిన నవీన్‌ యాదవ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది….

రెండుసార్లు పోటీ
⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్‌ యాదవ్‌ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి.

⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్‌ దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది..