చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం.. ప్రధాని మోదీ.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు మోదీ.

తొలుత ట్రంప్​తో ఫోన్‌లో సంభాషించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్‌నకు అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిపై కూడా సమీక్షించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు.