గిరిజన తండా ప్రజలే వాడి టార్గెట్.వీడు మామూలోడు కాదు..!

నమ్మించి ప్రజల నుంచి కోట్లల్లో డబ్బులు దండుకొని విలాసవంతమైన జీవితం…

₹50 కోట్లు మోసం సంబంధించి విషయాలను వెల్లడించిన పోలీసులు….

నిందితుడు రామవత్ బాలాజీ నాయక్ అరెస్ట్…

విలువైన ఆస్తి పేపర్లు, డాక్యుమెంట్లు, వెంచర్ల పత్రాలు, ఫామోసుల డాక్యుమెంట్స్, ఖరీదైన కార్లు స్వాధీనం…

గ్రామీణ గిరిజన తండాల ప్రజలను లక్ష్యంగా చేస్తూ అధిక వడ్డీ ఆశతో సుమారు ₹50 కోట్ల మోసం చేసిన కేసులో రామవత్ బాలాజీ నాయక్‌ ను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిపల్లి పోలీసు స్టేషన్లో నిందితుడిపై Cr.No.153,154,157/2025 లో కేసులు నమోదు చేయబడ్డాయి — సెక్షన్లు: 316(2), 318(4) BNS మరియు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ గ్రామీణ తండాల నుంచి సుమారు 106 మంది బాధితుల వద్ద నుంచి నెలకు 10% వడ్డీ అంచనాతో ప్రామిసరీ నోట్ల ద్వారా డబ్బు వసూలు చేసినట్టు నిర్ధారించారు. నిందితుడి వద్ద నుండి ఖరీదైన ఫార్చునర్‑స్కార్పియో వంటి కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 7 సెల్‌ఫోన్లు, 113 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేశారు. అలాగే మిర్యాలగూడ, హైదరాబాద్‑హయత్‌నగర్, దామరచర్ల ప్రాంతాల్లోని ఇళ్లు, భూములను కూడా జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. రియల్‑ఎస్టేట్, స్టాక్‑మార్కెట్ మరియు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పెట్టుబడుల పేరుని వాడి చాలా నష్టం ఏర్పడినట్లు గుర్తించారు. బాధితులు మధ్యవర్తులను నమ్మి తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికైనా ఇంకా బినామీ లేదా సంబంధిత సమాచారం ఉంటె వెంటనే గుడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరవేయాలని కోరారు. పోలీసులు బినామీలపై ప్రత్యేకం నిఘా పెట్టి, స్వాధీనం చేసిన ఆస్తులు కోర్టు ద్వారా బాధితులకు రికవరీ చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కేసుపై పూర్తి విచారణ కోసం అడిషనల్ SP ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగింది. బాధితులకు న్యాయం వచ్చే వరకు పోలీసులు బాధితులకు తోడుగా ఉంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు…