14న తెలంగాణ బంద్‌..


స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు

ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య..

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. అది అన్యాయం అంటూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 14న (మంగళవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, ఇది బీసీలకు తీరని అన్యాయం, అవమానకరం అని మండిపడ్డారు…