ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సీట్ల భాగస్వామ్యం ఖరారు..!

బిహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీల్లో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సీట్ల భాగస్వామ్యం ఖరారు చేసింది. మొత్తం 243 సీట్లపై ఒప్పందం కుదిరింది..

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు.

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు.

హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు.

రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు
బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్రమంత్రి చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) 29 స్థానాల్లో బరిలో దిగనుంది. కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం)కు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరు చొప్పున సీట్లు కేటాయించారు..