🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 10 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
బహుళ పక్షం,
తిథి : *సప్తమి* సా5.49 వరకు
నక్షత్రం : *ఆర్ద్ర* సా6.29 వరకు
తిథి : *సప్తమి* సా5.49 వరకు
నక్షత్రం : *ఆర్ద్ర* సా6.29 వరకు
యోగం : *పరిఘము* మ2.47 వరకు
కరణం : *భద్ర* ఉ6.50 వరకు
తదుపరి *బవ* సా5.49 వరకు
ఆ తదుపరి *బాలువ* తె4.07 వరకు
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము: *మ12.09 – 12.56*
మరల *మ2.30 – 3.17*
అమృతకాలం : *ఉ9.01 – 10.32*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండం : *ఉ10.30 – 12.00*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : *5.55*
సూర్యాస్తమయం: *5.38*
*_నేటి మాట_*
*డివోషన్ అనగా ఏమిటి??*
భక్తి అనగా రూప నామములు కాదు, ఆత్మ తత్వమునే నమ్మాలి.
కేవలం రూపనామములపై ఆధారపడరాదు.
అందరిలో ఉన్న ఆత్మనే నమ్మాలి, మనము కూడా కొన్ని సందర్భాలలో ” నా ఆత్మ సాక్షిగా చెబుతున్నాను” అని అంటాము కదా!
శరీరం క్షీణించినా ఆత్మ జీవించే ఉంటుంది.
కనుక’ రామ’ ఒక రూపము యొక్క పేరు కాదు.
అది దైవత్వం యొక్క పేరు ‘ రామా’ అనిగాని, ‘ కృష్ణా’ అనిగాని, ఏదైనా ఒక నామాన్ని స్మరిస్తూ ఉండండి.
శివ’ అంటే మంగళకరమైనది, అంటే మంగళకరమైనది అందించేది దైవనామమొక్కటే!
మనం అందరి క్షేమాన్నీ కోరు కోవాలి, క్రిమి కీటకాల క్షేమాన్నీ కూడా కోరాలి.
కనుకనే ఏదైనా దైవ కార్యం తరువాత మనం” లోకా సమస్తా స్సుఖినో భవంతు” అని చెప్పాలి,
సర్వులు క్షేమంగా ఉండాలి, ఆక్షేమంలోనే మన క్షేమం కూడా ఉంటుంది.
అందరి క్షేమం కోరేవారి హృదయాన్ని భగవంతుడు ఇష్ట పడతాడు.
ఇదే నిజమైన భక్తి యొక్క సారము, ” డివోషన్ ” అంటే ఆనంద సాగరము.
అదే ” నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం “.. ఇట్టి ఆనందాన్ని మనం సాధించాలి, అప్పుడే డివోషన్ చేత భగవంతునికి దగ్గర అవుతాము.
*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏