JubileeHills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాగంటి సునీత గెలుపు బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ..
కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డారని ఇంటింటికీ, మనిషి మనిషికి చెప్పాలి – కేటీఆర్.
ఒకటే ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళు 43 దొంగ ఓట్లు రాయించారు
మొత్తం కలిపి వేల ఓట్లు రాయించారు – కేటీఆర్.
GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు..
ఎందుకంటే మాకు ఒక్క సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మీద పగపట్టారు – కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు..
అజారుద్దీన్ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడు..
అజారుద్దీన్కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదు.. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు..
షేక్పేట్లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు.. అది ఆర్మీ వాళ్లు వచ్చి మాది అని గుంజుకున్నారు..
ఇందాక నేను వస్తుంటే కారు దగ్గరకి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు
ఉర్దూలో, తెలుగులో ఇన్ని బూతులు ఉంటాయని కూడా నాకు తెలియదు
అన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు.. అన్నా మీరు వచ్చి చెప్పే అవసరం లేదు
మేమే ఒక దుర్గా దేవి లాగా, కాలిక దేవిలాగా కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని చెప్పారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అని అన్నాడు, అది కోర్టులో నిలబడలేదు.. రేవంత్ రెడ్డికి అన్ని తెలిసినా ప్రజలను మోసం చేయడానికి అవ్వని పనులు చేస్తున్నాడు..