🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 16 – 10 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
బహుళ పక్షం,
తిథి : *దశమి* మ1.40 వరకు,
నక్షత్రం : *ఆశ్లేష* సా4.31 వరకు
యోగం : *సాధ్యం* ఉ7.46 వరకు
కరణం : *భద్ర* మ1.40 వరకు
తదుపరి *బవ* రా1.24 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ.7.02 వరకు*
మరల *తె4.37 నుండి*
దుర్ముహూర్తము : *ఉ9.49 – 10.36*
మరల *మ2.29 – 3.16*
అమృతకాలం : *మ2 56 – 4.31*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండం : *ఉ6.00 – 7.30*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం : *5.56*
సూర్యాస్తమయం : *5.36*
*_నేటి విశేషం_*
*🙏\|/🙏 నేడు రమా ఏకాదశి 🙏\|/🙏*
ఆశ్వీయుజ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు.
రమా ఏకాదశి మహాపాపములను హరించునని పద్మపురాణమున ఉత్తరాఖండంలో వివరించబడినది. ఈ పురాణమున ఏకాదశీ మహాత్మ్యము గూర్చి ఈ విధంగా తెలుపబడింది.
🙏\|/ఇక్ష్వాక మహారాజు పుత్రుడు ముచుకుందుడు అను మహారాజు విష్ణుభక్తుడు మరియు సత్యసంధుడు.అతని పరిపాలనలో రాజ్యం సుభీక్షంగా ఉండేది. ఈయన పుత్రిక ఉత్తమురాలైన చంద్రభాగను శోభనునికిచ్చి వివాహము జరిపించెను.
🙏\|/విష్ణు భక్తుడైన ముచుకుందుని రాజ్యంలో శ్రీహరి దినమైన ఏకాదశి నాడు ప్రజలందరూ నియమనిష్ఠలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించెదరు. అదేరోజు శోభనుడు మామగారి రాజ్యంకు వేంచేయగా తన భర్త ఆకలికి తాళలేడని తెలిసిన చంద్రభాగ చింతించెను. ఉపవాసంతో తన ప్రాణాలు హరించునని, తగిన ఉపాయమును సూచించమని శోభనుడు తన భార్యను కోరెను.కానీ ఆ రాజ్యంలో ఏకాదశినాడు పశుపక్ష్యాదులు సైతం ఆహారపానీయాలకు దూరంగా ఉంటాయి కావున దీనికి తరుణోపాయము లేదని చంద్రభాగ వాపోయెను. ధృడనిశ్చయంతో, సంకల్ప బలంతో ఉపవసించివలసిందిగా తన భర్తను కోరెను. దైవము సంకల్పించినది తప్పక జరుగునని విధిలేని పరిస్థితులలో శోభనుడు ఉపవసించెను.
🙏\|/ధృడమైన సంకల్పంతో ఏకాదశి నియమాన్ని ఆచరించిన శోభనుడు ఆకలికి తాళలేక మహాదు:ఖము అనుభవించెను. విష్ణు భక్తులు ఏకాదశినాడు రాత్రంతా సంతోషంగా హరిపూజతో జాగరణ చేస్తారు. కాని శోభనుడు ఆకలితో కలిగిన దు:ఖాన్ని తట్టుకోలేక సూర్యోదయ సమయానికి మరణించెను. మహారాజు సకల రాజలాంఛనములతో అంత్యక్రియలు జరిపించగా చంద్రభాగ స్థిరనిశ్చయంతో భర్తకు చేయవలసిన అన్ని ఉత్తర క్రియలు జరిపించి తండ్రి రాజ్యంలోనే నివసించెసాగింది.
🙏\|/‘రమాఏకాదశి’ ప్రభావంతో శోభనుడి ఆత్మ మందర పర్వత శిఖరముల మీదున్న దేవపురమునకు చేరెను. ఈ పురము హేమ స్థంభములతో అలంకరించబడి లెక్కలేనన్ని గుణములతో నున్న భవనమున వివిధ ఆకారములతో ఉన్న స్ఫటికములతో కూర్చబడిన సింహాసమును శోభనుడు అధిరోహించెను. గంధర్వులచే స్తోత్రము చేయబడుచూ అప్సరసలు వంటి స్త్రీలతో సేవించబడుతూ కుబేరునిలా రాజభోగములను అనుభవించచుండెను.
🙏\|/ముచుకుందుని రాజ్యంలో సదాచార సంపన్నుడు జపతపోనిష్ఠ పరాయణుడైన సోమశర్మ తన తపప్రభావంతో తీర్థయాత్రలు చేస్తూ మందర పర్వతము పైనున్న దేవపురమునకు చేరెను. అక్కడ శోభనుడిని కలిసిన సోమశర్మ అద్భుతమైన ఈ నగరానికి ఎలా చేరెనని ప్రశ్నించెను. అపుడు తాను రమా ఏకాదశినాడు ఉపవసించిన ఫలితమున నా ఆత్మ ఈ నగరమునకు చేరెనని, రమాఏకాదశి వ్రతాన్ని తాను శ్రద్ధతో ఆచరించలేదు కావున ఈ భోగం ధృవం కాదని (అశాశ్వతం), తన భార్య చంద్రభాగకు ఈవిషయాన్ని తెలియజేసి ఆమెను తన వద్దకు తీసుకొని రమ్మని సోమశర్మని కోరెను.
🙏\|/చంద్రభాగ నియమనిష్టలతో రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది కావున ఆమెకి లభించే వ్రతఫల ప్రభావం తన భర్త అయిన తనకు కూడా ఉంటుందని తద్వారా తాను నివసించే నగరం శాశ్వతమౌతుందని తలంచెను.
🙏\|/తిరిగి రాజ్యానికి చేరిన సోమశర్మ చంద్రభాగకు విషయం తెలియజేసి ఆమెను మందరాచలం మీదున్న వామదేవ మహర్షి ఆశ్రమానికి తీసుకొని వెళ్లగా మహర్షి ఆమెను వేదమంత్రములతో అభిషేకించగా ఋషిమంత్రము మరియు రమాఏకాదశి ప్రభావంతో చంద్రభాగ దివ్యదేహమును పొంది భర్త సమీపమునకు చేరెను. చంద్రభాగ తన 8వ ఏట నుండి యధోక్త విధిగా రమాఏకాదశి వ్రతాన్ని ఆచరించింది కావున ఆ పుణ్యప్రభావంతో దేవపురమును ధృవం (శాశ్వతం)చేసి భర్తతో కలిసి సుఖంగా ఉండెను.
🙏\|/రమా ఏకాదశి చింతామణి, కామధేనువు వంటిది కనుక కోరికలను నెరవేర్చును. ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు ఏకాదశివ్రత మహాత్మ్యమును వినినా వ్రత ఫలితమును పొందుతారు.
*_🥀శుభమస్తు🥀_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏