ఉపాధి పనుల్లో బోగస్ హాజరుకు చెక్..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కూలీలకు ఈ-కేవైసీ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ (NMMS) యాప్లో కూలీల వివరాలు, ఈ కేవైసీ నమోదు చేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7,65,128 జాబ్ కార్డులు ఉండగా.. 15,98,634 మంది కూలీలు ఉన్నారు._