BC రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..

డిల్లీ:

BC రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..

_• ప్రభుత్వ SLPని కొట్టివేసిన సుప్రీంకోర్టు._

_• పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలన్న సుప్రీం._

_• హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమన్న సుప్రీంకోర్టు.

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఈ రిజర్వేషన్‌ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకొని రావాలని చెప్పిన సుప్రీంకోర్టు .. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు ఏసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చంటూ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింగ్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు..