సమయానికి విధులకు హాజరు కానీ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసిన.. జిల్లా కలెక్టర్..

సూర్యాపేట జిల్లా కోదాడ

మునగాల…. సమయానికి విధులకు హాజరు కానీ ఐదుగురు అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం లో చోటు చేసుకుంది. మునగాల తాసిల్దార్ కార్యాలయాన్ని ఉద్యయాన్నే తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కార్యాలయం సిబ్బంది ఎవ్వరు లేకపోవడం తో అవక్కాయరు. 10.30 దాటుతున్న ఎవరూ రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్లను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. తాసిల్దార్ ఆర్ఐ ఫీల్డ్ లో ఉన్నారని తెలపడంతో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి కార్యాలయానికి రప్పించారు. సమయానికి రాని డిప్యూటీ తాసిల్దార్, ఏఎస్ఓ, రికార్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ మరో ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకి సమయంలో హాజరు పట్టికను పరిశీలించి హాజరు పట్టికను ఆయన వెంట తీసుకువెళ్లారు…
పలువురు నెట్టు జనులు కలెక్టర్ చేసిన ఈ పనిని అభినందిస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు మార్పు వచ్చి సమయానికి రావాలని కోరారు..

హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మఠంపల్లి, తో పాటు పలు మండలాల్లో తాసిల్దార్లతో సహా వివిధ శాఖల వారు సమయానికి హాజరు కావడం లేదని దీనిపై కూడా కలెక్టర్ కు దృష్టి పెట్టాలంటూ సోషల్ మీడియాలో వినతిలు విన్నవించుకుంటున్నారు..