రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: TPCC చీఫ్..

TG: ఈ నెల 18న బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు..

బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Mahesh Goud) స్పష్టం చేశారు. బీసీ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తెలంగాణ బంద్‌కు (Telangana bandh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ బంద్‌కు మద్దతు తెలపాలని బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజులా శ్రీనివాస్‌గౌడ్ గురువారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు (BC reservations) అనేది తమ పార్టీ ఎజెండా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ బంద్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తారని తెలిపారు. కాగా బీసీ సంఘాల బంద్‌కు ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ (BRS and BJP) మద్దతు ఇచ్చాయి. తాజాగా అధికార పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో 18న రాష్ట్రంలో బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవాకశం ఉంది..