నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ మీ వ్యాఖ్యలు తప్పు…ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ తీవ్రస్థాయిలో స్పందించారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీకి అండగా నిలిచిన ఆమె, రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ భయపడుతున్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు..రాహుల్ గాంధీ మీ వ్యాఖ్యలు తప్పు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భయపడరు. అమెరికా వ్యూహాత్మక దౌత్య విధానాన్ని బాగా అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నారు. అచ్చం ట్రంప్‌నకు అమెరికా ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే మోదీ కూడా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు ఏది అవసరమో అదే చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నాను. ఒక దేశ ప్రధానిగా ఆయన చేయాల్సింది చేస్తున్నారు. వీరిద్దరూ వారి దేశాలకు ఏది మంచిదో అదే చెబుతారు, చేస్తారు. దేశ ప్రధానమంత్రి అయ్యేందుకు కావాల్సిన అర్హత, సామర్థ్యం లేకపోవడం వల్లే ఈ రకమైన నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు.”..
https://x.com/MaryMillben/status/1979010605173608894?t=QQCvf_ai5SFqcaZtAIh8xA&s=19