హైవేలపై బోర్డులు గ్రీన్ కలర్లోనే ఎందుకుంటాయి?..
హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి చోటా ఆకుపచ్చ రంగు బోర్డులు కనిపిస్తాయి. నగర పేర్లు, దూరాలు, దిశలు – అన్నీ ఆ రంగులోనే ఉంటాయి. కానీ ఈ రంగును యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. దానికి శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయి.
నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు తరచుగా సైన్ బోర్డులు కనిపిస్తుంటాయి. రోడ్డుపై భారీ సైజులో ఉండే ఈ సైన్ బోర్డులు పట్టణాలు, నగరాల మధ్య దూరాన్ని వాహనదారులకు తెలియజేస్తాయి. దీంతో పాటు రోడ్ సేఫ్టీ సూచనలను అందిస్తాయి. సరిగ్గా గమనిస్తే ఈ సైన్ బోర్డులు గ్రీన్ కలర్లో ఉంటాయి. మరి ఇవి ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉన్నాయి? ఈ రంగునే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు? వేరే కలర్స్ ఉంటే ఏమవుతుంది? అనే విషయాలను సోషల్ మీడియాలో ఓ యూజర్ వివరించారు.సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కొన్ని రకాల సైన్ బోర్డులు చూస్తుంటాం. ముఖ్యంగా, డైవర్షన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, రోడ్డు వంపుకి సంబంధించిన బోర్డులు ఉంటాయి. దాదాపుగా ఇవి రెడ్, వైట్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తాయి. భారత్‌లో కొన్ని రోడ్లపై బ్లూ కలర్ సైన్ బోర్డులు కూడా కనిపిస్తాయి. కానీ, హైవేలపై మాత్రం పూర్తిగా గ్రీన్ కలర్లోనే సైన్ బోర్డులు ఉంటాయి.హైవేలపై కూడా రెడ్ కలర్లో బోర్డులు ఏర్పాటు చేయొచ్చు కదా అని అనుకుంటారు. కానీ, దీని వెనుక సైన్స్ ఉంది..
*✳️కళ్లకు సౌకర్యమైన రంగు*
ఆకుపచ్చ రంగు మానవ కంటికి ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని చూసినా కళ్లకు ఒత్తిడి ఉండదు. డ్రైవర్లు గంటల తరబడి రోడ్డుపై ప్రయాణించే సమయంలో అలసట లేకుండా దృష్టి నిలుపుకోవడానికి ఈ రంగు ఉపయోగపడుతుంది.
*🔴ఎరుపు, పసుపు ఎందుకు ఉపయోగించరంటే.?*
ఎరుపు, పసుపు రంగులు వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. అవి హెచ్చరికలు, ప్రమాద సూచనలకు ఉపయోగిస్తారు. అయితే డైరెక్షన్స్, ప్రదేశాల పేర్లకు ఉపయోగించే బోర్డులు ఎక్కువ సాంధ్రత ఉన్న కలర్స్‌తో ఉండకూడదు. అందుకే వీటికి గ్రీన్ కలర్‌ను ఉపయోగిస్తుంటారు
*శాస్త్రీయ కారణం*
మానవ కంటికి కనిపించే వర్ణపటంలో ఆకుపచ్చ రంగు మధ్యలో ఉంటుంది. కాబట్టి అది తక్కువ కాంతిలోనూ, వర్షం కురుస్తున్న సమయంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో డ్రైవర్‌కు బోర్డు స్పష్టంగా చదవడానికి సులభం అవుతుంది.