తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 12 రోజుల్లో రోడ్డు ప్రమాదంలో 110 మంది మృతి..!

తెలుగు రాష్ట్రాలను బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయా? రెండు వారాల్లో రెండు ఘోరమైన ప్రమాదాలు? ఇంతకీ ఈ పాపం ఎవరిది? కర్నూలు, చేవెళ్ల బస్సు భారీ ఘటనల్లో తప్పుంతా డ్రైవర్లదేనని అంటున్నారు. కారణాలు ఏమైనా.. గాల్లో కలిసిపోయేది ప్రయాణికుల ప్రాణాలే? చిన్న ప్రమాదాలు కూడా లెక్కిస్తే.. గడిచిన 12 రోజుల్లో దాదాపు 110 మంది ప్రాణాలు కోల్పోయినట్టేనని పలువురు అంచనా వేస్తున్నారు….

నిన్న కర్నూలు.. నేడు రంగారెడ్డి జిల్లా

చివరకు ఆర్టీసీ, టిప్పర్ డ్రైవర్లు సైతం మృతి చెందారు. ఆర్టీసీ బస్సు కుడి వైపు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ లెక్కన ప్రమాదం ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో చేవెళ్లు, తాండూరు వాసులు ఎక్కువగా ఉన్నరు. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. దాదాపు టిప్పుర్ లారీలో 50 టన్నుల వరకు కంకర వేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం.

గడిచిన 12 రోజులుగా పరిశీలిస్తే ఏపీ, తెలంగాణల్లో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 100 మంది మరణించినట్టు నిపుణుల అంచనా. కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘటనల్లో దాదాపు 40 మంది వరకు మరణించారు. ఇవికాకుండా ప్రతీ రోజూ వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలను లెక్కిస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

కేంద్ర రహదారి రవాణా శాఖ-2023 నివేదికల ప్రకారం.. దేశంలో ప్రతీ గంటకు 55 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ లెక్కన దాదాపు నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోందన్నమాట. ప్రతీ ప్రమాదంలో 20 మంది మరణిస్తున్నారు. 2022 కంటే దేశంలో 2023లో ప్రమాదాలు పెరిగాయన్నది ఆ నివేదిక సారాంశం. దాదాపు 68 శాతం ప్రమాదాలు ట్రాఫిక్ ఉల్లంఘన, అతివేగం కారణంగానే సంభవించాయని తేల్చింది..

ఏపీ-తెలంగాణ రోడ్డు ప్రమాదాలు..

అక్టోబరు 24న హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మరణించారు. ప్రయాణికులను గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. డీఎన్ఏ పరీక్షలు చేస్తేగానీ డెడ్‌బాడీలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన తర్వాత ఏపీ-కర్ణాటక-తెలంగాణ ప్రభుత్వాలు అలర్టయ్యాయి. రేపోమాపో సమావేశానికి రెడీ అవుతున్నాయి…