చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ: షర్మిల..

AP: సీఎం చంద్రబాబుపై YS షర్మిల సంచలన
వ్యాఖ్యలు చేశారు. నిన్న బనకచర్ల, నేడు నల్లమల సాగర్.. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా.. చంద్రబాబుకు ఆశమాత్రం చావలేదన్నారు. నదుల అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రం అన్యాయం చేసినా నోరు మెదపలేదన్నారు. కొత్త ప్రాజెక్టు అయితే ATMగా పనికొస్తుందని బాబు డ్రామాలు ఆడుతున్నారని ట్వీట్ చేశారు.