ఒక అపర భక్తురాలు చేసిన పనికి అందరు షాక్..

కార్తీక మాసం నడుస్తొంది. వచ్చే అమావాస్య వరకు కూడా చాలా మంది భక్తులు కార్తీక మాసం నేపథ్యంలో శివ, వైష్ణవ ఆలయాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది దీపాలు వెలిగిస్తారు. అగరవత్తులు వెలిగిస్తారు. దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా మనం చూస్తునే ఉంటాం..కానీ ఇక్కడ ఒక అపర భక్తురాలు చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు. ఈ ఘఠన ఏపీలోని పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురంలోని శ్రీదత్త స్వామి ఆలయంకు వచ్చిన ఒక భక్తురాలు స్వామికి కర్పూరం వెలిగించి ఆరతి ఇచ్చింది. మరీ ఆమెకు ఏమన్పించిందో ఏంటో కానీ.. ఆ వెలిగించిన కర్పూరం కాస్త హుండీలో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది..కాసేపటికి హుండీ లో నుంచి పొగలు వస్తుండటంతో అక్కడి సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే హుండీలో నీళ్లు పోశారు. ఆ తర్వాత హుండీని తెరిచారు. అప్పటికే అనేక నోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అక్కడి సిబ్బందితో లెక్కింపు చేయించారు.
ఆ తర్వాత నోట్లను బైటకు తీసి హెయిర్ డ్రాయర్ తో ఆరబెట్టారు. ఈ ఘటన తెలిసి అందరు అవాక్కయ్యారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి భక్తిరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.