బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభ..

Bihar Elections Live Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసానుంది.. బీహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ఈరోజు మలి విడతలో 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగిన విషయం విదితమే.. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి.. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 యొక్క రెండవ దశలో, అనేక మంది ప్రముఖులు పోటీ పడనున్నారు, వీటిలో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

భాగల్పూర్ జిల్లాలోని కహల్గావ్ అత్యంత వీక్షకులను ఆకర్షించే స్థానాల్లో ఒకటి , ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది..NDA తరపున JD(U) తరపున శుభానంద్ ముఖేష్, కాంగ్రెస్ తరపున ప్రవీణ్ సింగ్, RJD తరపున రజనీష్ భారతి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిజెపి తిరుగుబాటు నాయకుడు పవన్ యాదవ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు..

సరికొత్త రికార్డ్ సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపు
బిహార్‌ రెండో విడత పోలింగ్‌లో సరికొత్త రికార్డ్‌ సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లరకు పిలుపునిచ్చారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మరింత మందిని ఓటు వేసేలా వారు ప్రేరేపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అని అన్నారు. ముందు ఓటు ఆ తర్వాతే రిఫ్రెష్‌మెంట్‌లు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు..