హన్మకొండ జిల్లా నాటు కోళ్లను రోడ్డు మీద వదిలేసిన విడినా మిస్టరీ..!

సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై శనివారం ఉదయం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. కొందరు అజ్ఞాత వ్యక్తులు ఒక్కటి రెండు కాదు, సుమారు 2,000 నాటు కోళ్లను రోడ్డు మీద వదిలేసి దూరమయ్యారు. ఈ కోళ్లు ఒక్కసారిగా పొలాలు, రోడ్ల చుట్టూ కనిపించడంతో స్థానికులు వాటిని పట్టుకునేందుకు పరుగులు పెట్టారు.
ఎవరో కోళ్లను వదిలిపెట్టారని తెలిసిన
గ్రామవాసులంతా వేటగాళ్లుగా మారారు. చాకచక్యంగా కోళ్లను పట్టుకున్నారు.
ఒక్కొక్కరు 2-3 కోళ్లతో సంతృప్తి చెందగా ..కొందరు పదుల సంఖ్యలో తీసుకువెళ్లారు…

ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కోళ్ల ఫారం యజమాని నాటు కోళ్లను వదిలారు..

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కొద్ది రోజుల క్రితం వందల సంఖ్యలో నాటు కోళ్లను వదిలి వెళ్లిన దుండగులు..

స్థానికులంతా ఆ కోళ్లను తీసుకెళ్లగా, ఆ కోళ్లను తినొద్దని ఆదేశాలు జారీ చేసిన వైద్య శాఖ..

ఈ ఘటన గురించి దర్యాప్తు చేసి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్టు నిర్ధారించిన పోలీసులు..