చిత్తూరు జిల్లాలో(Chittoor-District) వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(MLA Peddireddy Ramachandra Reddy ) అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వీడియో విడుదల చేశారు…మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీనితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందని పేర్కొంది. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు. ఆక్రమణ దారుల పేర్లు, కేసుల వివరాలను అటవీ శాఖ వెబ్సైట్లో పెట్టాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. CM CBN, క్యాబినెట్‌కు ఆక్రమణల గురించి వివరించి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు..
https://x.com/APDeputyCMO/status/1988851624719315460?t=a5wWOeuRSo25HJ4oCeJKkA&s=19