సీఈసీ జ్ఞానేశ్ కుమార్‍కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు కొనసాగిస్తున్న వేళ ఆ ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వీ ది లీడర్స్’ ఉద్యమ వ్యవస్థాపకుడు కె.అన్నమలై సీజేపీకి మద్దతు తెలిపారు. తాజాగా కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడిన అన్నామలై.. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. సీజేపీ నిరసన పద్ధతులు, కొన్ని చర్యలతో తాను ఏకీభవించకపోయినా.. వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మాత్రం పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నిరసనకారులను అరెస్టు చేయడం, జైలులో వారు గడిపే సమయానికి సంబంధించి ఇబ్బందులకు గురిచేయడం వల్ల సీజేపీ నాయకులు మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఈ విషయంలో వారు తప్పుడు పద్ధతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. CJP పోరాటానికి అనూహ్యంగా ఆయన మద్దతు పలకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.