మాపై ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ…ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి..

కనీస వివరణ తీసుకోకుండా మాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. అని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , రాజంపేట ఎంపీ అన్నారు ..
ఈ ల్యాండ్ ఫారెస్ట్‌ ల్యాండ్ కాదని గెజిట్‌లో కూడా ఉంది. రెవెన్యూ రికార్డులు కూడా క్లియర్‌గా ఉన్నా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికోసం మా కుటుంబం ఇచ్చిన స్థలం విలువే 15కోట్లు. రూ. 3 కోట్లు విలువ చేసే భూముల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మదనపల్లి ఫైల్స్‌ మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఎనిమిది నెలలుగా ఏ విచారణ చేసారు?. మాపై ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలి అన్నారు..