ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం..గాంధీ భవన్ లో సంబురాలు…

ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది..

ఒక్క మూడో రౌండ్ లో తప్ప కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ చాలా స్వల్ప ఆధిక్యం వచ్చింది. భారీ ఆధిక్యంతో హస్తం పార్టీ దూసుకుపోతోంది. అటు పోస్టల్ బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 8 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ 21,495 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్‌ యాదవ్.. అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్‌ యాదవ్.. పోస్ట్‌ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కలేదు.. కౌంటింగ్‌ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్‌ రెడ్డి….

గాంధీ భవన్ లో సంబురాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో పార్టీ నేతలు గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. తగ్గేదేలే, రప్పారప్పా డైలాగ్ లతో సీఎం రేవంత్ ఫొటో పెట్టుకొని సంబురాలు చేసుకుంటున్నారు. 2028 ఎన్నికల్లో వంద సీట్లు గ్యారెంటీ అంటూ ఫ్లెక్సీలను హస్తం నేతలు సిద్ధం చేసుకున్నారు.

నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయం కావడంతో గాంధీ భవన్ వద్దకు మంత్రులు చేరుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబురాల్లో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ హవాతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతమని ప్రజలు తీర్పునిచ్చినట్లయిందని.. ఇదే ఊపును కొనసాగిస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు…