నవీన్ యాదవ్ గెలుపుపై మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు..!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. నవీన్ యాదవ్ విజయంపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు..
ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. పోలింగ్‌ రోజున ఎంతో అరాచకం సృష్టించారని తెలిపారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. నేను ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇవాళ ఉదయం నుంచే కౌంటింగ్‌ హాలులో ఆడవాళ్లపై కాంగ్రెస్‌ ర్యాగింగ్‌ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోట రిగ్గింగ్‌ చేయడం వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని అన్నారు. ఒక మహిళపై కాంగ్రెస్‌ నేతలు రౌడీ రాజకీయం చేశారని అన్నారు. ప్రజలను కాంగ్రెస్‌ భయబ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..

ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్ అయింది. ఆడబిడ్డను ఎంత హింస పెట్టాలో అంత పెట్టారు.. రౌడీయిజంతో ఎన్నికలు జరిగాయని సునీత అన్నారు..నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌లు, రౌడీయిజం గెలిచింది. నన్ను ఓడించేందుకు అందరూ ఏకమయ్యారు. నేను మాట్లాడినా.. నవ్వినా తప్పే అన్నట్లు చేశారు. దీన్ని గెలుపు అనరు.. అడ్డదారిలో గెలిచారు. నైతికంగా నాదే గెలుపు అని మాగంటి సునీత అన్నారు.

అన్ని పార్టీలు కలిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఇది. మేము సింగిల్‌గా పోటీ చేశాం. కౌంటింగ్ సెంటర్‌లో కూడా ర్యాగింగ్ చేశారు. వాళ్లు ఇచ్చిన చీరలు కట్టుకున్నట్లుగా మాట్లాడారు. డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్‌తో కాంగ్రెస్ గెలిచిందని మాగంటి సునీత అన్నారు…