ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్
ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు
https://youtu.be/cnX-1t4ihs4?si=ODUZ3TP4oBZOrzu7
ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి
రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము.. వాళ్ళ సంపాదన వేల కోట్లల్లో ఉంటది – హీరో నాగార్జున..
హైదరాబాద్: పైరసీని అరికట్టేందుకు తెలంగాణ
పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీనటుడు నాగార్జున (Nagarjuna) అన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ గురించి నాగార్జున మాట్లాడుతూ తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు రెండు రోజులుపాటు నిర్బంధించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారన్నారు.
ఇది బిగ్ ట్రాప్.. ఫ్రీగా సినిమా చూస్తున్నామనుకోవద్దు
66 తెలంగాణ పోలీసులకు అభినందనలు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని (ibomma imma ravi) అరెస్ట్ చేసిన తర్వాత చెన్నై నుంచి నా స్నేహితుడు ఫోన్ చేసి ఇక్కడ మేం చేయలేనిది అక్కడ మీరు చేశారన్నాడు. కేవలం రూ.20కోట్ల కోసం నిందితులు ఇదంతా చేయడం లేదు. పైరసీ వెనుక అంతర్జాతీయ ముఠా ఉంది. 50లక్షల మంది సబ్సైబర్ల డేటా వారికి చేరింది. ఇది బిగ్ ట్రాప్. ఉచితంగా సినిమాలు చూపించాలనేది వారి ఉద్దేశం కాదు. దీనిలో రూ.వేల కోట్లు దోచేసే పెద్ద ప్లాన్ ఉంటుంది. సినిమాలు ఫ్రీగా చూస్తున్నామని అనుకోవద్దు.. దాని వెనుక ఉన్న పెద్ద మోసాన్ని గమనించాలి” అని నాగార్జున అన్నారు..
ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తాం – సీపీ సజ్జనార్...
ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు
ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది
కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్‌సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు
2019లో ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడు..
ఇమ్మడి రవి హార్డ్‌డిస్క్‌లో 21 వేల సినిమాలు పెట్టాడు
1972లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుండి మొన్న విడుదలైన ఓజీ మూవీ దాకా ఉన్నాయి
ఇమ్మడి రవి ఇప్పటి వరకు రూ.20 కోట్లు సంపాదించాడు.. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం
50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది అని సీపీ సజ్జనార్ అన్నారు..
ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు.. సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు….
ఐ-బొమ్మ అంశంపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మక్కాకు వెళ్లిన బస్సు దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసుల విభాగం సైతం ఈ ఘటనపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ రోజు టాలీవుడ్‌కు చెందిన చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ కి వేల కోట్ల నష్టం వాటిల్లింది.. దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదన్నారు. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించామని గుర్తు చేశారు.. ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని ఎట్టకేలకు పట్టుకున్నామన్నారు. మొత్తం 5 కేసులు నమోదు చేశాం.. దుద్దెల శివరాజ్, ప్రశాంత్ అనే ఇద్దరిని ఇదివరకే అరెస్ట్ చేశాం.. పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారన్నారు..ఇమ్మడి రవి గురించి సీపీ సజ్జనార్ సంచలన విషయాలు తెలిపారు. “బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన వేల సినిమాలు పైరసీ చేశాడు ఇమ్మడి రవి.. రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.. 20 కోట్ల వరకు సంపాదించాను అని చెప్తున్నాడు. 50 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ డేటా ఇమ్మడి రవి వద్ద ఉంది.. ఈ డేటా ను కూడా మిస్ యూస్ చేసే అవకాశం ఉండేది.. దీని వెనక పెద్ద రాకెట్ ఉంది.. మీ డేటా డార్క్ వెబ్ కి చేరే అవకాశం కూడా ఉంది.. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది పేరెంట్స్ కి కడుపుకోత మిగిలింది.. మహారాష్ట్ర లో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.. పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది.. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. కరేబియన్ ఐల్యాండ్ సిటిజన్ షిప్ కూడా తీసుకున్నాడు.. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు.. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు..” అని వెల్లడించారు..