MLA అనర్హత పిటిషన్లపై CJ ఘాటు వ్యాఖ్యలు…!
స్పీకర్ వ్యవహార శైలి పై వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం.
రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోమని గతంలోనే చెప్పాం..
_• విచారణ లో జాప్యం జరగొద్దు._
_• విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించక పోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుంది._
_• నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరపాలనుకుంటున్నారో స్పీకర్ కు చెప్పండి అంటూ ఆయన తరపు న్యాయవాదులతో అన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి…
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ కు మరింత సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు..
నాలుగు వారాల సమయం ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం..
విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ధర్మాసనం..
రోజువారీ విచారణ జరపమామని గత విచారణ సందర్భంగా నే చెప్పాం..
నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలి..
విచారణ పూర్తి చేయకపోతే కోర్టు కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందన్న ప్రధాన న్యాయమూర్తి ..
ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియజేస్తామన్న స్పీకర్ తరపు న్యాయవాదులు..
విచారణకు మరింత సమయం కోరిన స్పీకర్ తరపు పిటిషన్, స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యల కోసం దాఖలైన పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించిన ధర్మాసనం..
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. “మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి..” అని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు..